చింతలమానేపల్లి : కాగజ్‌నగర్,ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో ఫారెస్ట్ కన్జర్వేషన్ సంభందించిన జీవో నెంబర్ 49(G.O. No. 49 ) ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ( Cancellation ) ఆదివాసీ సంఘాలు నిరసనలను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మండలంలోని తహసీల్ కార్యాలయంలో తహశీల్దార్ మాడావి దౌలత్ కుమార్, ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్వో ఇక్బాల్‌కు తుడుందెబ్బ,ఆదివాసీ సంఘ నాయకులు వినతిపత్రాలు అందజేశారు.
ఆదివాసీ సంఘ నాయకులు మాట్లాడుతూ పేసా చట్టం (1996)ప్రకారం జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని ప్రతి గ్రామంలో గ్రామసభ తీర్మానం చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా జీవో నెంబర్ 49ను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూజరి సుగుణాకర్,ఆదివాసీ నాయకులు కుమురం కనకయ్య, ఎదుల సాగర్, కత్తెర్ల భీమేష్, సిడాం పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.