నార్నూర్, సెప్టెంబర్ 23 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉపేందర్ వైద్య అధికారులకు సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హాస్పిటల్ రికార్డులు, వైద్యం అందించే తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా అపరిశుభ్రత లోపించి సీజనల్ వ్యాధులు సోకే అవకాశాలు ఉంటాయని, గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందించాలని సూచించారు. దవాఖానకు వచ్చే రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా వైద్యశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి జితేందర్ రెడ్డి, హెచ్ ఈ ఓ తులసీదాస్, వైద్య సిబ్బంది ఉన్నారు.