Hyderabad | ఒకే నంబర్‌పై నాలుగు వాహనాలు.. హైదరాబాద్‌లో నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ దందా
Hyderabad | ఒకే నంబర్ ప్లేట్‌పై నాలుగు వాహనాలు.. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగుచూసిన వ్యవహారంతో పోలీసులే షాక్ అవుతున్నారు. నంబర్ప్లేట్ల దందా చాలారోజులుగా కొనసాగుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఒకే నంబర్ ప్లేట్‌పై నాలుగు వాహనాలు.. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగుచూసిన వ్యవహారంతో పోలీసులే షాక్ అవుతున్నారు. నంబర్ప్లేట్ల దందా చాలారోజులుగా కొనసాగుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కానీ ట్రాఫిక్ చలాన్లు వస్తే తప్ప అవి కూడా అసలు వాహనాల యజమానులు పోలీసుల దృష్టికి తీసుకొస్తే తప్ప దొంగ నంబర్ప్లేట్లన్న విషయం తెలియడం లేదని పోలీసులే చెబుతున్నారు. ఇటీవల వరుసగా ఒకే నంబర్‌తో వేర్వేరు వాహనాలు ఉండి వాటిపై ట్రాఫిక్ చలాన్లు రావడం సాధారణమైపోయింది. నగర ట్రాఫిక్ విభాగంలో ఈ మధ్యకాలంలో నెలకు ఐదారు ఇలాంటివే కేసులు వస్తున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
అసలు యజమానికి చలాన్లు..
ఇటీవల హైదరాబాద్ నగరంలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌పై నాలుగు ద్విచక్రవాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అసలు ఓనర్‌కు తెలియకుండా మరో ముగ్గురు ఇదే నంబర్ ప్లేట్‌తో బైక్‌లు నడుపుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినప్పుడు అసలు యజమానికి చలాన్లు వస్తున్నాయి. దీంతో చలాన్లకు సంబంధించిన ఫొటోలు చూస్తే అసలు విషయం బయటపడింది.హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి చలాను రాశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ చలాను అసలు నంబరు ప్లేట్ కలిగిన బైక్ ఓనర్ బేగరి గోపాల్‌కు చేరడంతో షాక్‌కు గురయ్యాడు. అప్పటికే తన బైక్‌పై (నంబర్ టీఎస్ 34 సీ 1858) పలు చలాన్లు ఉండడంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు.
చలాన్లు పడ్డ బైక్‌ల ఫొటోలను ట్రాఫిక్ పోలీసుల సహాయంతో చూడగా ఆ వాహనాలు తనవి కాదని గోపాల్ గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వాహనరికార్డులను పరిశీలించగా ఒకే నంబర్ ప్లేట్‌తో నాలుగు వాహనాలు నగరంలో తిరుగుతున్నట్లు గుర్తించారు. బాధితుడి బైక్ బీహెచ్ఈఎల్లో ఉండగా అదే నంబర్ ప్లేట్‌తో వికారాబాద్, సంగారెడ్డి, బేగంపేటలలో మరో మూడు ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. ఇదే నంబర్‌తో మరో ముగ్గురు వేర్వేరు చోట్ల నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగలను కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నేరాలకు అనుకూలం..
నంబర్ ప్లేట్ దందాతో నేరాలు చేయడం సులువవుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కేసులు పెరిగిపోతున్నాయని, ఒకరు నేరంచేస్తే మరొకరికి చలాన్ వస్తుందని సిటీ పోలీసు నేరవిభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇందులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతోనే ఇది బయటపడుతున్నదని ఆయన తెలిపారు. డూప్లికేట్ నంబర్ ప్లేట్లు తయారుచేసిన వారితోపాటు వాటిని అక్రమంగా వినియోగిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఇటువంటి మోసాల పై వాహనదారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

