కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ) : మారుమూల ప్రాంతాల్లోని మా వోయిస్టు ప్రభావిత గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక పథకం(ఐఏపీ-ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్) ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విడుతల వారీగా సుమారు రూ.5,691.65 కోట్లతో 47 పనుల ను మంజూరు చేసింది. ఈ నిధులతో రోడ్లతోపాటు వంతెనలు, కల్వర్టులు, గ్రామీణ రవాణా కు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.
జిల్లా లో దాదాపు 15 రోడ్లు అటవీ శాఖ అనుమతు లు లేక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఏండ్లు గడుస్తున్నా రోడ్లు పూర్తికాక మారుమూల గ్రా మాల ప్రజల రహదారి కష్టాలు తీరడం లేదు. కాగా.. ఆసిఫాబాద్ జిల్లాలో మంగళ, బుధవారాల్లో కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్ర పర్యటిస్తున్నారు. అటవీశాఖ అనుతులు లేక నిలిచిన రోడ్డు నిర్మాణ పనులను కేంద్ర మంత్రి దృష్టికి అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకువెళ్లి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
అటవీ శాఖ అనుమతులు లేక నిలిచిన రోడ్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో..
బెజ్జూర్ మండలంలోని సోమిని నుంచి కమ్మర్గాం వయా మురళీగూడ వరకు రూ.14.54 కోట్లతో వేయాల్సిన బీటీ రోడ్డు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో..