మంచిర్యాల, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీబీఎస్ సిలబస్ బోధిస్తామని చెప్పి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి మోసం చేసిన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ స్కూల్ ముందు శనివారం తల్లిదండ్రు లు ధర్నాకు దిగారు. సీబీఎస్ సిలబస్ అంటేనే గతేడాది ఈ పాఠశాలలో పిల్లలను జాయిన్ చేశామని, ఫీజు మొత్తం చెల్లించాక ఇది సీబీఎస్ కాదని తెలిసిందన్నారు. అప్పుడు యాజమాన్యాన్ని అడిగితే ప్రతి నెల వచ్చే నెలలో పర్మిషన్ వస్తుందని చెప్పుకుంటూ ఏడాది మొత్తం నడిపించారన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ పర్మీషన్ వస్తుందని చెప్పినా ఇప్పటి వరకు రాలేదని వాపోయారు. సీబీఎస్ అనుమతులు లేకుండా పాఠశాలలను నడిపిస్తూ సీబీఎస్ తరహాలోనే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. కనీసం స్టేట్ గవర్నమెంట్ సిలబస్ కూ డా చెప్పకుండా వాళ్లకు నచ్చిన పుస్తకాలు వాడు తూ, పిల్లల మీద ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఎస్ చెప్పం, రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ కూడా చెప్పం ఇష్టముంటే పిల్లలను చదివించండి లేకపోతే ఫీజు కట్టి తీసుకువెళ్లండి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్కూల్ విద్యాబోధన చేస్తున్న టీచర్లలో ఏ ఒక్కరూ అర్హులు కాదని, సర్టిఫికెట్లు చూపించకుండా దాస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యా యం చేసే వరకు స్కూల్ ముందు నుంచి వెళ్లేది లేదని గేట్లు మూసి ధర్నాకు దిగారు. సాయంత్రం వర్షం పడుతున్నా కూడాఎక్కడికి కదలకుండా గొడుగులు పట్టుకొని మరీ భీష్మీంచుకు కూర్చున్నారు. చివరకు విద్యాశాఖ అధికారులు వచ్చి సర్దిచెప్పి పంపించారు. ఈ విషయంపై డీఈవో యాదయ్యను వివరణ కోరగా.. గ్రీన్ స్కూ ల్ సీబీఎస్ పర్మిషన్ లేదన్నారు.
గతంలో గొడవ జరిగినప్పుడే ఈ విషయాన్ని తాము స్ప ష్టం చేశామని, ఎంఈవో ఆ స్కూల్ నోటీసులు సైతం ఇచ్చారని చెప్పారు. స్కూళ్లకు రానున్న మూడు రోజులు సెలువులు ఇచ్చి, డీఈవో కార్యాలయంలో తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఆ తదుపరి చర్యలు తీసుకుం టామన్నారు. ప్రిన్సిపాల్ ఆయూబ్ ఫోన్ వివరణ కోరగా.. ఫీజుల విషయమై గొడవ జరిగిందని, ప్రస్తుతం పిల్లలను ఇంటికి పంపిస్తున్నాం తరువాత మాట్లాడుతామంటూ ఫోన్ పెట్టేశారు.