తాండూర్ : బడి బయట పిల్లలను గుర్తించేందుకు (Children Enroll) గురువారం నుంచి సీఆర్పీలతో సర్వేను ప్రారంభించామని మండల విద్యాధికారి ఎస్ మల్లేశం( MEO Mallesham) తెలిపారు. తెలంగాణ సమగ్ర శిక్షా సంచాలకుల ఆదేశాల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బడి బయట పిల్లల గుర్తింపునకు సర్వే నిర్వహించి వివరాలను ప్రబంద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
బడి మధ్యలో మానేయడం, దానికి గల కారణాలు తెలుసుకొని విద్యార్థులను దగ్గరలో వున్న పాఠశాలలో చేర్పించాలని అన్నారు. తాండూరు మండల పరిధిలోని బడి బయట పిల్లలు 6 నుంచి 14 సంవత్సరములు, 15 నుంచి 20 సంవత్సరముల వయసు గల పిల్లల సర్వేను గురువారం నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మండల వ్యాప్తంగా ఎంఈవో, కాంప్లెక్స్ పరిధిలలో ప్రధానోపాధ్యాయులు సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తారని వివరించారు. కాంప్లెక్స్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీలు సర్వేలో భాగంగా ఆవాస ప్రాంతాల్లో బడి బయట పిల్లలను గుర్తిస్తారని తెలిపారు.