కాసిపేట, ఆగస్టు 28 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో ఆగస్టు 29న ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. అయితే అభ్యర్ధులకు పది ఓట్ల మెజార్టీ లేకపోతే ఎన్నికల ఫలితాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఆగస్టు 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్, పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 266 ఓట్లు ఉన్నారు. దీనిలో 257 మంది నేరుగా ఓట్లు వేయనుండగా 9 మంది సీల్డ్ కవర్ ఓటింగ్ వేయనున్నారు. ముందుగా 266 మంది ఓట్లు కాగా ట్రైనీలని అభ్యంతరాలు రావడంతో కార్మిక శాఖ 9 మందిని తొలగించి 257 మంది ఓట్లను ఫైనల్ చేశారు. తొలగించిన వారు తమకు ఓటు హక్కు ఉందని అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీనిపై కార్మిక శాఖ అధికారులు ఎన్నికలు వాయిదా వేశారు. దీనిపై యూనియన్ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో పలు సూచనలు చేస్తూ ఎన్నికలు నిర్వహించి 9 మందికి సీల్డ్ కవర్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
ఈ మేరకు కార్మిక శాఖ అధికారులు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. 257 మంది ఓట్లు నేరుగా వేయనున్నారు. 9 మంది సీల్డ్ కవర్ ద్వారా ఓటు వేయనున్నారు. పోలింగ్ అనంతరం 257 మంది ఓట్లను మాత్రమే లెక్కిస్తారు. ఒక ఓటు మెజార్టీ వచ్చినా ఇక్కడ గెలుపు డిక్లేర్ కాదు. సీల్డ్ కవర్ ఓట్ల కారణంగా మెజార్టీ పది ఓట్లు ఉంటనే శుక్రవారం ఫలితాలు తేలనున్నాయి. పది లోపు మెజార్టీ ఉన్నా గెలుపు ఫైనల్ కాదు. ఈ 9 మంది ఓట్ల లెక్కింపు చేస్తేనే ఫలితాలు తేలనుండడంతో అప్పటి వరకు ఫలితాలకు బ్రేక్ పడుతుంది. కనీసం 138 ఓట్లు వస్తేనే పూర్తి మెజార్టీ వచ్చి గెలుపు సాధ్యమవుతుంది. సీల్డ్ కవర్ ఓట్లు కావడంతో తొమ్మిది మంది ఓట్లు కోర్టు ఆదేశాల అనంతరమే లెక్కించనున్నారు. ఈ తొమ్మిది మందికి పూర్తి స్థాయిలో ఓటు హక్కు ఉంటుందా లేదా అని విచారణ అనంతరం ఫైనల్ చేసి అప్పుడు ఫలితాలు ప్రకటిస్తారు. అప్పటి వరకు ఫలితాలు బ్రేక్ పడనున్నాయి. పది ఓట్ల మెజార్టీ వస్తానే ఫలితాలు తేలనున్నాయి. ఈ తొమ్మిది మంది ఓట్లను పోల్చుకుంటే మెజార్టీ పది కన్నా ఎక్కువ ఓట్లు వస్తేనే ఫలితాలు ప్రకటిస్తారు. లేకుంటే ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.