మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 14 : మంచిర్యాల జనరల్ ఆస్పత్రిలో బుధవారం 20 మందికి వేసక్టమి ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్లు చేయించుకున్న ఒక్కొక్కరికి రూ. 1100 పారితోషికం అందించామని డీఎంహెచ్వో సుబ్బరాయుడు తెలిపారు.
ఆపరేషన్లు చేసిన వారిలో యాకూబ్ పాషా, అరుణశ్రీ, నవీన్, ఏఎస్వో దామోదర్, ఎల్డీ రాజేశ్వర్, జిల్లా మీడియా అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు.