బోథ్, మే 2: అన్నదాతను ఆదుకునేందుకే మద్దతు ధరకు ప్రభుత్వం పంటలు కొనుగోలు చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బోథ్ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బహిరంగ మార్కెట్లో మక్కలకు ధర లేనందున రైతులు నష్టపోకుండా క్వింటాలుకు రూ.1962 మద్దతు ధర కల్పిస్తూ కొనాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి మక్కతో పాటు శనగలు, జొన్నలు, కందులను కొనుగోలు చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షే మం కోసం సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
హమాలీలకు యూనిఫాంలు పంపిణీ
బోథ్ మార్కెట్ యార్డులో పని చేస్తున్న హమాలీలకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ యూనిఫాం లు పంపిణీ చేశారు. 25 మంది హమాలీలు, 12 మంది చాటావాలాలు, ఆరుగురు దడ్వాయిలకు రెండు జతల చొప్పున యూనిఫాంలు సమకూర్చారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా హమాలీలకు యూనిఫాంలు పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి చెక్కులు ..
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 26 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రాథోడ్ బావురావు అందజేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ రుక్మాణ్‌సింగ్, వైస్ చైర్మన్ సంజీవ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ అతిఖొద్దీన్, ఎన్నికల విభాగం డీటీ సూరజ్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, ఆర్బీఎస్ కన్వీనర్ జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్‌బిన్ సలాం, వైస్ చైర్మన్ ఆర్ లింబాజీ, సొసైటీ చైర్మన్ కే ప్రశాంత్, సీఈవోలు బారె భూషణ్, గోలి స్వామి, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాము, చట్ల ఉమేశ్, ప్రవీణ్, రెవెన్యూ సిబ్బంది, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఇచ్చోడ, మే 2 : ఇచ్చోడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప్రాంభించారు. ఈ సందర్భంగా రైతు నరేందర్‌ను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉన్నతికి కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, సర్పంచ్ సునీత, నాయకులు ప్రవీణ్, పురుషోత్తం, లక్ష్మీబాయి, జిల్లా మార్కెట్ యార్డు ఏడీ శ్రీనివాస్ మార్కెట్ యార్డు కార్యదర్శి రమేశ్ బాబు పాల్గొన్నారు.