తాండూర్ : మండలంలోని మాదారం టౌన్షిప్లో గల పల్లె ప్రకృతి వనంలో ప్రజలకు హాని కలిగించే ప్రమాదకర కోనో కార్పస్ చెట్లను ( Conocarpus trees) మాత్రమే తొలగించామని ఎంపీడీవో శ్రీనివాస్ ( MPDO Srinivas ) తెలిపారు . బుధవారం స్థానిక నాయకులతో కలిసి పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు .
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ చెట్లను తొలగింపు వల్ల పేరుకుపోయిన చెత్తను త్వరలోనే తొలగించి పల్లె ప్రకృతి వనంలో మరిన్ని సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మరింత ఆహ్లాదం అందే విధంగా చర్యలు చేపడుతామన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను పరిశీలించారు . స్థానికులు ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు .
ఎంపీడీవో వెంట మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి , మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ , సింగిల్ విండో మాజీ చైర్మన్ సూరం దామోదర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పుట్ట శ్రీనివాస్ , పంచాయతీ కార్యదర్శి సౌందర్య తదితరులు ఉన్నారు.