తాండూర్ : ఆదివాసీ గూడేల్లో ( Tribals Areas ) రోడ్లు , బ్రిడ్జిలు నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి ( Sanke Ravi ) డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివాసీలు చేస్తున్న దీక్షలకు సీపీఎం ( CPM ) మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆదివాసీ నాయకులతో కలిసి తాండూర్ ఎంపీడీవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆయన మాట్లాడుతూ ఆదివాసి గూడేలకు నేటికి రవాణా సౌకర్యం లేదు, చిన్న వర్షాలకే రోడ్ డ్యాములు మునిగిపోవడం, కొట్టుకుపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఆదివాసి గ్రామా అభివృద్ధిని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. దీని మూలంగా అదివాసీలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం తాండూర్ మండల కార్యదర్శి దాగం రాజారాం, నాయకులు బొల్లం రాజేశం, దుర్గం నానయ్య, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కుర్సెంగ బాబురావు, టీఏజీఎస్ మండల కన్వీనర్ బాదిరావు, ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.