గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేదిక నిర్వహణ, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.
– ఎదులాపురం/నిర్మల్ టౌన్, జనవరి 25
నిర్మల్ టౌన్/ఎదులాపురం, జనవరి 25: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో గురువారం ఉదయం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్ జాతీయ జెండాలు ఎగురవేసి ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు.వేదిక నిర్వహణ, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందించేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆయా కలెక్టరేట్లను అలంకరించారు. విద్యుదీపాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.