Rajiv Gandhi University of Knowledge Technologies | ఆర్జీయూకేటీ (RGUKT) బాసర మరియు మహబూబ్ నగర్ కేంద్రాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ B.Tech కోర్సుల ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. మొత్తం 20,258 దరఖాస్తులు అందినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దరఖాస్తుల పరిశీలన అనంతరం జులై 4వ తేదీన ఫలితాలు విడుదల చేయబడతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత, జులై 7వ తేదీ నుండి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రవేశాల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వీసీ స్పష్టం చేశారు. అర్హత సాధించిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.