కుభీర్, సెప్టెంబర్ 15: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.30 వేల విలువచేసే శుద్ధ జల ప్లాంటును ఏర్పాటు చేసి స్థానిక వ్యాపారి రెడ్డిశెట్టి ఆనంద్ తన ఉదారతను చాటుకున్నాడు. తన పుట్టినరోజును పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుకోవాలన్న సంకల్పంతో సోమవారం ఆయన పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ బడులు బలోపేతం అవుతున్నాయని అన్నారు.
విద్యార్థులకు శుద్ధ జలం అందించాలనే సదుద్దేశంతో దాత రెడ్డిశెట్టి ఆనంద్, రెడ్డిశెట్టి నాగేశ్వర్ లను ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సట్ల గంగాధర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చెర్మన్ వైశాలి, విద్యా అభివృద్ధి కమిటీ సభ్యులు బోయిఢీ అభిషేక్, గంగశేఖర్, నారా పరశురాం, వెంక టస్వామి, ఆర్. నిఖిల్, కందూరి కనకయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.