కుభీర్, ఏప్రిల్ 01: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ విట్టలేశ్వరాలయంలో ఈనెల 7వ తేదీన నిర్వహించే హిందూ మహాసమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విట్టల్ రెడ్డిని బుధవారం దేగాంలోని ఆయన నివాసంలో కుభీర్ సర్పంచ్ కందూరి సాయినాథ్, మాజీ సర్పంచ్ పానాజీ విజయ్ కుమార్ కమిటీ సభ్యులు ఆయన్ను కలిసి ఆహ్వానించింది.
ఈ సమ్మేళనానికి భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతి, ప్రధాన వక్తగా రాజుల్వార్ దిగంబర్ లు విచ్చేయుచున్నారని తెలిపారు. ముందుగా గోమాత పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం హనుమాన్ చాలీసా, పారాయణ, సామూహిక కుంకుమార్చన అనంతరం జరిగే కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాగభూషణ్, నరేష్ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఉన్నారు.