ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
మామడలో పల్లె ప్రగతి, పోలీస్‌స్టేషన్ ఆవరణలో గ్రీన్ జోన్ ప్రారంభం
సీఎం కేసీఆర్ మొక్క పరిశీలన
మామడ, జూలై 6 : హరిత తెలంగాణ లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం ప్రారంభించారని, ఇదే స్ఫూర్తితో నిర్మల్‌ను హరిత జిల్లాగా మారుద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. మండలకేంద్రంలోని పల్లె ప్రకృతి వనం, పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రీన్ జోన్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. వనంలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆరేళ్ల క్రితం సీఎం కేసీఆర్ నాటిన మొక్కను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక చెట్టు ఇచ్చే ఆక్సిజన్ కొన్ని వందల ప్రాణవాయువు సిలిండర్లతో సమానమన్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ హన్మాగౌడ్, ఎంపీటీసీ నవీన్, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ జీవన్‌రెడ్డి, ఎస్ఐ వినయ్‌కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్‌రావు, ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గంగారెడ్డి, ఎంపీడీవో రమేశ్, తహసీల్దార్ కిరణ్మయి, పంచాయతీ కార్యదర్శి మంగేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మండల నాయకులు పాల్గొన్నారు.
లోకల్ వెల్మల్‌లో..
సోన్, జూలై 6 : సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ గ్రామంలో మంత్రి అల్లోల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భావితరాలు బాగుడాలంటే బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అందుకు మొక్కలు పెంచాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణ సర్కారు వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల నుంచి 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అర్హులందరికీ వా రం రోజుల్లో కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రామ్రెడ్డి, అల్లోల సోదరుడు మురళీధర్‌రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజీప్రసాద్, రైతు బంధు సమితి మండలా ధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సర్పంచ్ వంజరి కవిత, తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, ఎంపీడీవో ఉషారాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.