నిర్మల్ అర్బన్, జూన్ 13 : నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ సాయి ప్రసాద్ ఈ నెల 11న ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో గల సముద్ర మట్టానికి 5895 మీటర్ల ఎత్తులోగల కిలిమంజారో పర్వతాన్ని ఆయన అధిరోహించారు. 2023లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు వరకు అధిరోహించగా తాజాగా కిలిమంజారో శిఖరాన్ని సైతం అధిరోహించడంపై ఆయనను జిల్లా ప్రజలు, మిత్రులు అభినందించారు.