నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 26 : ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను విధించడం జరిగిందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుయితే డయల్ 100కు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాశ్ కుమార్, రాజేశ్ మీనన్, సీఐలు నవీన్‌కుమార్, సైదారావు, ప్రేమ్ కుమార్, నైలు, గోపినాథ్, ప్రవీణ్ కుమార్, మల్లేశ్, కృష్ణ, ఆర్ఐలు రాం నిరంజన్ రావు, శేఖర్, రమేశ్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.