భైంసా, అక్టోబర్ 13 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వివిధ కేసుల్లో చీటింగ్‌కు పాల్పడిన ఘరానా మోసగాడు ఎండీ రిజ్వాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 17 తులాల బం గారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ కిర ణ్ ఖారే వివరాలు వెల్లడించారు. ఇటీవల జహేదాన్ బంగారం షాపులో గోల్డ్ చైన్, ఉంగరాలు చూపించమని రిజ్వాన్ అడిగాడు. వారు చూపించగా.. వాటిని ఎత్తుకెళ్లడంతో యజమాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు రిజ్వాన్‌పై కేసు నమోదు చేసి గాలించారు. అతన్ని పట్టుకొని బంగారు ఆభరనాలు స్వాధీ నం చేసుకున్నారు. అంతేగాకుండా కాశీనాథ్ వద్ద నిర్మల్‌లో ల్యాండ్ ఉందంటూ పెద్దవాళ్లతో మాట్లాడిస్తూ సుమారు రూ.42 లక్షలు, రెండు మోటర్ సైకిళ్లను తీసుకెళ్లాడు. అతను కూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. డబ్బు, వాహనాలను రికవరీ చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. సుమారు 17 తులాల బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీ నం చేసుకున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, కానిస్టేబుల్ గంగాధర్, భూషణ్‌కు అభినందనలు తెలిపారు.