ఎదులాపురం, జూలై16: క్రమశిక్షణగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని పోలీసు అధికారులతో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల రోజులుగా జరిగిన నేరాలు, , నమోదైన కేసులు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులు , పోలీస్ స్టేషన్ వారీగా నిర్వహిస్తున్న 17 వర్టికల్స్ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో స్నేహాపూర్వకంగా ఉండాలన్నారు. జిల్లాలో మట్కాను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. ప్రతిభ చూపిన 32 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి గుడ్ సర్వీస్ ఎంట్రీ, క్యాష్ రివార్డు పత్రాలు, కేసుల పరిష్కారంలో ప్రతిభ చూపిన సీసీఎస్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి నగదు బహుమతితో ప్రోత్సహించామన్నారు. బైక్ చోరీల కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించి పోలీసులకు సహకరించిన రిమ్స్ సెక్యూరిటీ గార్డ్ నరేశ్‌కు నగదు బహుమతి అందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎస్.శ్రీనివాసరావు, సమయ్‌జాన్‌రావు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ, ఆదిలాబాద్ డీఎస్పీ వీ ఉపేందర్, ఏఆర్ డీఎస్పీ ఎం. విజయ్ కుమార్ , సీఐలు వై. రమేశ్‌బాబు, పీ సురేందర్, కే మల్లేశ్, బీ రఘుపతి, కే నరేశ్ కుమార్, జే కృష్ణమూర్తి, ఈ.చంద్రమౌళి, ఎం నైలు, జే గుణవంతరావు, రిజర్వ్ సీఐ డీ వెంకటి, ఎం శ్రీపాల్, ఎం . వంశీకృష్ణ, సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ కార్యాలయం ఏవో యూనున్ అలీ, సెక్షన్ ఇన్చార్జి ఆశన్న, సిబ్బంది పాల్గొన్నారు.