నిర్మల్ టౌన్, జనవరి 19 : క్రీడలతోనే మానసి కోల్లాసం పెంపొందుతుందని నిర్మల్ జిల్లా జడ్జి కర్ణకుమార్ పేర్కొన్నారు. నిర్మల్ కోర్టు ఆవరణలో నిర్మల్ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గురువారం స్పోర్ట్స్ మీట్ పోటీలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకునేం దుకు ఇలాంటి క్రీడా పోటీలు ప్రతి ఒక్కరికీ అవసరమని తెలిపారు. పోలీసులు, న్యాయవాదు లు, కోర్టు సిబ్బంది ఉల్లాసంగా ఉండాలని కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లా రెడ్డి, ప్రధాన కార్యదర్శి నూనె గంగాధర్, న్యాయ వాదులు శ్యాంసుందర్‌రెడ్డి, నరేందర్, రమణ, మహేందర్, సాయి, మధుకర్, అర్చన, తదితరు లు పాల్గొన్నారు.
క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని భైంసా ఇన్చార్జి న్యాయమూర్తి అజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని బార్ అసోసియేషన్‌లో 26 జనవరిని పురస్కరిం చుకొని ఏర్పాటు చేసిన క్యారమ్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలతోనే మానసికో ల్లాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయిడి రఘువీర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ తాడేవార్ సాయి నాథ్, జనరల్ సెక్రటరీ మునీర్ హైమద్, వైస్ ప్రెసిడెంట్ జాకీ తదితరులు ఉన్నారు.