నిర్మల్ చైన్‌గేట్, మార్చి 2 : ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అంతకు ముందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డీసీవో నర్సయ్య ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి పాల్గొన్నారు.
లోకేశ్వరం మండలంలోని కనకాపూర్‌లో తమకు వ్యవసాయ పట్టా భూమి ఉందని, ఆ భూమని 38 ఏళ్లుగా కాస్తు చేసుకుంటు న్నట్లు కొబ్బనోళ్ల నవీన్ తెలిపారు. అబ్దుల్లాపూర్ వీడీసీ వాళ్లు ఈ భూమి మీది కాదని, తమను భూమి వద్దకు రానివ్వడం లేదని తెలిపారు. గతంలో దరఖా స్తు ఇచ్చినా సమస్య పరి ష్కారం కాలేద న్నారు. సమస్య పరిష్కరించి తనకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రం లోని హెచ్‌పీ పెట్రోల్ పంపు చుట్టూ భూగర్భ జలాలు కలుషితం అవుతున్నా యని, బోరు బావులలోని నీరు డీజిల్ వాసన వస్తున్నదని తగు చర్యలు తీసుకో వాలని గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నీటిలో ఆయిల్ చుక్కలు చుక్కలుగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పూల్లేనగర్ మార్లగొండలో సర్పంచ్ మిషన్ భగీరథ నీరు ప్రజలకు సరఫరా చేయకుండా నిలిపివేశారని, దీంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో 300 జనాభా ఉందని, సర్పంచ్ తాగునీటి సరఫరాను నిలిపివేశారని తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఎనిమిదేళ్లుగా తాగునీరు సరఫరా అవుతున్నదని, ఇటీవల ఎన్నికలలో గెలిచిన సర్పంచ్ తాగునీరు నీరు రాకుండా బంద్ చేశారన్నారు.
ఎదులాపురం, మార్చి 2 : బీఆర్ఎస్ ఆదిలాబా ద్ పట్టణ అధ్యక్షుడు అలల్ అజయ్ అమ్మ ఇటీవలే మృతిచెందింది. విషయం తెలుసుకున్న మా జీ మంత్రి జోగు రామన్న శాంతినగర్ లోని వారి నివాసానికి వెళ్లి అజయ్‌ను పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. రావుత్ మనోహర్ మెట్టు ప్రహ్లాద్, మనోహర్ ఉన్నారు.
ఇచ్చోడ, మార్చి 2 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు భూషణ్ సోదరుడు అంజి ఇటీవల మృతి చెందాడు. సోమవారం విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం దాబా(కే) గ్రామానికి చెందిన జాదవ్ అనిత ఇటీవల మృతి చెందగా కుటుంబీకులను పరామర్శించారు. ప్రగాఢ సానుభుతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ ప్రీతంరెడ్డి, ఉప సర్పంచ్ శిరీష్‌రెడ్డి, పాండురంగ్, రమేశ్, దేవేందర్‌రెడ్డి, గణేశ్, ఈశ్వర్, ప్రతాప్ ఉన్నారు.