కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులు (New Sarpanches ) మినరల్ ఫండ్ ( Mineral Fund ) కోసం ఐక్యంగా పోరాడాలని తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మడవి వెంకటేశ్వర్ పిలుపు నిచ్చారు. బుధవారం కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల సమయంలో రాజకీయాలని ఎన్నికలు పూర్తయిన తరువాత అభివృద్ధి వైపు బాట వేయాలన్నారు. మండలంలో నిధులు ఉన్న ఇక్కడ వినియోగించుకోకపోవడం వల్ల కాసిపేట మండలం అభివృద్ధి చెందడం లేదన్నారు. నూతన సర్పంచులు ఐక్యంగా ఉండి మినరల్ ఫండ్ మండలంలోని వినియోగించే విధంగా పోరాడాలన్నారు.
దేవాపూర్ సిమెంట్ కంపెనీ నుంచి వచ్చే రూ. కోట్ల రూపాయల నిధులు పక్క ప్రాంతాలకు పోతుందని , కాసిపేట మండలంలో మాత్రం ఉపయోగించడం లేదని ఆరోపించారు. మంచిర్యాల నుంచి గోదావరి నీళ్లు 300 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ కు తీసుకెళ్తున్నారని, పక్కనే ఉన్న కాసిపేట మండలానికి కనీసం తీసుకురాకపోవడం అన్యాయమన్నారు.