కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కొత్తరేషన్ కార్డుల పంపిణీ అరకొరగా సాగుతున్నది. కొన్నింటిని రిజెక్ట్ చేయగా, మరికొన్ని పెండింగ్‌లో పెట్టడంపై అసహనం వ్యక్తమవుతున్నది. ఇక అన్ని అర్హతలున్నా అనేక మందికి పంపిణీ చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది.
జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం 22630 దరఖాస్తులు రాగా, వీటిలో 6884 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లోనే ఉ న్నాయి. మరో 1348 దరఖాస్తులను అధికారులు రిజెక్ట్ చేశారు. మిగతా 14398 మందికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం వచ్చిన 22,630 దరఖాస్తుల్లో 6884 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టడంపై లబ్ధిదారుల్లో అసహ నం వ్యక్తమవుతోంది. తమకు అన్ని అర్హతలున్నప్పటికీ తమ దరఖాస్తులను పెడింగ్‌లో పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
కొత్తరేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ని రాశతప్పడం లేదు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమ దరఖాస్తులను అధికారులు పెండింగ్‌లో ఉంచడంపై అర్హులైన లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సివిల్ సైప్లె కార్యాలయంలో 1862 దరఖాస్తులు, ఎమ్మార్వో కార్యాలయాల్లో 703, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వద్ద 4319 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచారు. అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న 6884 దరఖాస్తుదారుల కుటుంబాల్లో మొత్తం 20 వేల 477 మంది లబ్ధిదారులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు వస్తే తమకు ప్రభుత్వం అందించే రేషన్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఉంటుందని భావించిన వీరి ఆశలు సాగుతుందని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ అన్ని అర్హతలుండి రేషన్ కార్డులు రాని వారుఅడియాసలయ్యాయి.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్ మండలంలో 749 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా బెజ్జూర్‌లో 328, చింతలమానేపల్లిలో 439, దహెగాంలో 419, జైనూర్‌లో 323, కాగజ్‌నగర్‌లో 1591, కెరమెరిలో 278, కౌటాలలో 395, లింగాపూర్‌లో 112, పెంచికల్పేట్లో 159, రెబ్బెనలో 450, సిర్పూర్-టీలో 498, సిర్పూర్-యులో 174, తిర్యాణిలో 162, వాంకిడిలో 807 దరఖాస్తులను అధికారులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంచారు.
మాకు రేషన్ కార్డు పొందేందుకు అన్ని అర్హతలున్నయి. కానీ మాకు రేషన్ కార్డు రాలే. నాకు పెళ్లి అయిన తర్వాత మా తల్లిదండ్రులకు ఉన్న కార్డులో నుంచి నా పేరు తొలగించుకొని నేను సొంతంగా రేషన్ కార్డు కోసం ఐప్లె చేసుకున్న. రేషన్ కార్డు లేక ఏ పథకానికీ దరఖాస్తు చేసుకోలేకపోతున్న. రెండేళ్లుగా మా కుటుంబం రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తోంది. అధికారులు ఈ సారైన రేషన్ కార్డు ఇస్తరని ఆశపడిన. కానీ రాలే. మా రేషన్ కార్డు ఎందుకు పెండింగ్ పెట్టారో తెలియడం లేదు.
– పంద్రం నాగోరావు, చింతకర్ర, జైనూర్ మండలం
నాకు రేషన్ కార్డు పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. నా పెళ్లి తర్వాత భార్య, ప్లిలల పేర్లు పెట్టి కొత్త కార్డు కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న. కానీ, నాకు రేషన్ కార్డు రాలే. కూలీనాలీ చేసుకొని బతుకుతున్నం. మాకెందుకు కార్డు ఇవ్వలేదో చెప్పాలి. ఇకనైనా అధికారులు స్పందించాలి.
– అయ్యుబ్ ఖాన్, జైనూర్
నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న. కానీ మాకు రేషన్ కార్డు రాలే. మస్తు తిప్పల పడుతున్నం. ఇప్పుడు దేనికైనా రేషన్ కార్డు తప్పని సరి అంటున్నరు. నాకు అన్ని అర్హతలున్నప్పటికీ రేషన్ కార్డు రాలే. కూలీ చేసుకొని బతికేటోళ్లం . మాకు న్యాయం చేయాలి.
– జాదవ్ సంజీవ్, లింగాపూర్