కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కాగా, శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం గులాబీ దళంలో నూతనోత్సాహాన్ని నింపింది.
సభలకు నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. జన ప్రభంజనాన్ని చూసి ప్రతిపక్ష పార్టీల్లో ఆందోళన కనిపిస్తుండగా, బీఆర్ఎస్లో మాత్రం తమ అభ్యర్థుల గెలుపుఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.