ఆదిలాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించా రు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌లు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రామన్న మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతా దినోత్సవం స్ఫూర్తిగా బీఆర్ఎస్ ప్రజల పక్షా న పోరాడుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని.. పేదలు, రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుందన్నారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందని కనీసం యూరియాను అందించలేని పరిస్థితుల్లో ఉందన్నారు. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. యూరియా దొరుకక రైతులు పంటలు నష్టపోతున్నారన్నారు. గ్రూప్-1 అభ్యర్థులను అరెస్ట్‌లు చేస్తూ వారిపై నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగల్లో అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. 1948లో నిజాం నిరంకుశ పాలనకు స్వస్తి పలికి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన రోజును తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజయ్, మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగరావు, గోవర్ధన్, గండ్రత్ రమేశ్, రాజన్న, విజ్జిగిరి నారాయణ, శ్రీనివాస్, ధమ్మపాల్, స్వరూపరాణి, మమతా, పర్వీన్ పాల్గొన్నారు.
సోన్, సెప్టెంబర్ 17 : నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో గల తెలంగాణ భవన్లో బుధవారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జెండాను బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కే.రాంకిషన్‌రెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, నాయకులు భూషన్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, కృష్ణారెడ్డి, దేవి శంకర్, గండ్రత్ రమేశ్, జీవన్‌రావు, లక్ష్మీనారాయణగౌడ్, హైమాద్, బస్వరాజు ఉన్నారు