కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు ( Sculptor ) పర్వత్వార్ సాయి శ్యాంకు ( Sai Shyam ) జాతీయస్థాయి ( National Award ) పురస్కారం దక్కింది. శిల్పకళా రంగంలో చేస్తున్న విశేష కళకు గాను హైదరాబాదులోని రవీంద్ర భారతిలో శ్రీ గౌతమేశ్వర కళా సేవా సంస్థ, శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో 2025 -కీర్తి చక్ర పురస్కారాన్ని అందజేశారు.
ఇటీవల నిర్మల్‌లో ప్రభుత్వ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేన్గేట్లో నెలకొల్పిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని కృష్ణశిలతో చెక్కారు. దీంతో ఆయనకు జాతీయ పురస్కారం దక్కింది. శిల్పకళతో పాటు కర్రతో ( కార్వింగ్) అనేక రకాల విగ్రహాలు చెక్కడంలో నేర్పరైన శ్యామ్ కుభీర్‌లో శిల్పకళాధామం నెలకొల్పి ఎందరో కళాకారులకు ఉపాధిని కల్పిస్తున్నారు.
వినాయక, దుర్గామాత విగ్రహాలను విభిన్న రూపాలలో తయారుచేసిన విగ్రహాలను చుట్టుపక్కల జిల్లాలతో పాటు మహారాష్ట్రకు విక్రయిస్తున్నారు. సాయిశ్యామ్ కు జాతీయ పురస్కారం దక్కడంతో ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, సన్నిహితులు అభినందించారు.