నార్నూర్ : హైదరాబాద్లో నవంబర్ 8,9వ, తేదీలలో నిర్వహించనున్న మూడవ జాతీయ సమైక్యత (National Integration) సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్ (Paydor Deepak) పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గాంధీ చౌరస్తా వద్ద జై భారత్ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు దున్న లక్ష్మేశ్వర్ అధ్యక్షతన సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ ఉద్యమస్ఫూర్తితో భారతజాతిని ఏకం చేసేందుకు మతోన్మాదాన్ని నిర్మిలించేందుకు, స్వామి వివేకానంద కలలు నిజం చేసేందుకు ఈ సమ్మేళనం జరగనున్నట్లు వివరించారు.
కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్, మాజీ జడ్పీటీసీలు హేమలత బ్రిజ్జిలాల్, రూపావంతి జ్ఞానోబా పుష్కర్, జేఏసీ మాజీ చైర్మన్ రాథోడ్ ఉత్తమ్, ఆడే దిగంబర్, రాథోడ్ సుభాష్, హైమద్,అసన్ ఖాన్, యశ్వంత్ రావు, మహమ్మద్ ఖురేషి, రాహెల్ ఖాన్, నేతాజీ తదితరులు ఉన్నారు.