మంచిర్యాలటౌన్, జూలై 10: బీసీ కార్పొరేషన్ రుణాలు వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డి మాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలోగల అంబేదర్ విగ్ర హం వద్ద జేబుకు నల్ల రిబ్బన్లను ధరించి ని రసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం చేపట్టి 18 నెలలు అవుతు న్నా ఇప్పటి వరకూ బీసీ రుణాలు విడుదల చే యలేదని, రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం, దరఖాస్తులు చేసుకొని రెండు నెలలు గడుస్తున్నా సబ్సిడీ రుణాల ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు.
ఇప్ప టికైనా బీసీ నిరుద్యోగ యువతకు రుణాలు విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ బీసీ నిరుద్యోగ యువతను ఆదుకోవాలని డి మాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగ యువతతో రాబో యే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివా స్, రాష్ట్ర నాయకులు గజేల్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, కీర్తి భిక్షపతి, చంద్రగిరి చంద్రమౌళి, ఆరెందుల రాజేశం, లక్ష్మీనారాయణ, అంకం సతీశ్, షేక్ సల్మాన్ పాల్గొన్నారు.