‘పెరుగన్నం’ సంతృప్తినిస్తున్నది
మండుటెండలో రాకపోకలు సాగించే వారికి 31 రోజుల పాటు పెరుగన్నం పంపిణీ చేశామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తున్నదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. నడిపెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో ప్రభుత్వ దవాఖాన ఎదురుగా మే ఒకటో తేదీన ప్రారంభించిన దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది.
- మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
మంచిర్యాలటౌన్, మే 31 : మండుటెండలో రాకపోకలు సాగించే వారికి 31 రోజుల పాటు పెరుగన్నం పంపిణీ చేశామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తున్నదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. నడిపెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో ప్రభుత్వ దవాఖాన ఎదురుగా మే ఒకటో తేదీన ప్రారంభించిన దివాకరన్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పెరుగన్నం తిన్నారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన మంచిర్యాలకు వివిధ పనుల నిమిత్తం చుట్టు పక్క ప్రాంతాల నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తుంటారని, వేసవికాలంలో వారి ఆరోగ్యానికి మేలు చేసేలా పెరుగన్నం పంపిణీ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా చేపడుతున్నామన్నారు.
నెల రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు, అభిమాను లు పాల్గొని విజయవంతం చేశారని, వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేటర్లు పెట్టెం స్వరూప, లక్ష్మణ్, సత్తా ర్, నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, తోట తిరుపతి, ఒడ్నాల రవీందర్, జాడి భానుచందర్, పుప్పాల స్వర్ణకార్, బలికొండ రమేశ్, మంతేన గట్టయ్య, నక్క తిరుపతి, మనోహర్, ప్రవీణ్, పవన్, రాము పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

