తాండూర్ : తాండూర్ సర్కిల్ నూతన సీఐగా ఎన్ దేవయ్య (N Devaiah) శుక్రవారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. బెల్లంపల్లి వన్ టౌన్ సీఐగా పనిచేసిన దేవయ్య తాండూర్‌కు( Tandoor CI ) బదిలీపై వచ్చారు. సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన దేవయ్యకు తాండూర్, మాదారం ఎస్సైలు డీ కిరణ్ కుమార్, సౌజన్య, పోలీసులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ మీడియాతో మాట్లాడారు.
శాంతి భద్రతల పరిరక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సర్కిల్ పరిధిలోని తాండూర్, మాదారం, భీమిని, కన్నెపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.