భైంసా టౌన్, జనవరి 2 : ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీలో పోరాడుతానని, కాంగ్రెస్‌ను నిలదీస్తానని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని హంపోలి (కే), ఇలేగాం, కుంసర, బోరిగాం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. అధికారులు దరఖాస్తు చేసుకున్న వారిలో పేదవారిని గుర్తించి పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో శివకృష్ణ, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీవో మోజమ్ హుస్సేన్, సర్పంచ్‌లు ప్రసాద్ పటేల్, ప్రవీణ్ పాల్గొన్నారు.