Mukharake Farmers | నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా ముఖరా కే రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పంట పొలంలో నిలబడి చెప్పులతో కొట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నా సమయానికి రైతు భరోసా వెయ్యక,ఇప్పటి వరకు 2 సార్లు రైతు భరోసా ఎగ్గొటి రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు.
రభి పంట వేసి నెల రోజులు అయిపోతున్నాఇంకా రైతు భరోసా వేయలేదని, రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం మాత్రం ఇంకా వేయలేదని, యూరియా కోసం యాప్ను తెచ్చి రైతులకు మరో సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది అని అన్నారు.
రెండు సంవత్సరాలు అయినా ఇంకా సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, నాడు కేసీఆర్ ఉన్నప్పుడు అడగకుండానే టింగ్ టింగ్ మంటూ సమయానికి రైతు బంధు వేసేవాడని, అన్ని విధాల రైతులను ఆదుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 రైతు భరోసా ఇస్తానని అర్రాస్ పాట పాడి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని వాపోయారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించి మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టు మాకు శిక్ష అయింది అని, వెంటనే రైతు భరోసా వెయ్యాలని జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా పంట పొలంలో నిలబడి చెప్పులతో కొట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖరా కే రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు పాల్గొన్నారు.
Manchu Manoj | మహిళల వస్త్రధారణ వివాదం.. శివాజీకి మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్
Dense Fog | తీవ్రమైన పొగమంచుతో పలు వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి
Anchor Anasuya | ‘మా బాడీ మా ఇష్టం’.. నటుడు శివాజీకి అనసూయ కౌంటర్