జన్నారం, ఫిబ్రవరి 14 : కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలో విధించిన ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే వాటిని ఎత్తివేయాలని ప్రజలు, వాహనదారులు డిమాం డ్ చేశారు. శుక్రవారం జన్నారంలోని ఆర్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఎఫ్డీపీటీ శాంతారాం, డీఎఫ్‌వో శివ్‌ఆశిష్‌సింగ్ ఎన్జీవోలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుసుకొని.. అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు.
అటవీశాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 6 గం టలకు వరకు వాహనాల రాకపోకలను కొనసాగించాలని ఎఫ్డీపీటీ శాంతారాంకు వినతి పత్రం అందజేశారు. సమస్యలు సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని శాంతారాం చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త శ్రీరాముల భూమాచారి, వ్యాన్, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ బాబా, నాయకులు ఎస్కే అక్రం, ముత్యం సతీశ్, రాజశేఖర్, ముస్తాఫా పాల్గొన్నారు.