భీమారం, ఆగస్టు 24 : తల్లి జ్వరంతో మృతి చెందగా, పురుగుల మందు తాగి దవాఖాన లో చికిత్సపొందుతున్న కుమారుడు కడసారి చూపునకు నోచుకోకపోయాడు. ఈ విషాద ఘ టన మంచిర్యాల జిల్లా భీమా రం మండలం పోలంపల్లి గ్రా మంలో జరిగింది. నర్మిట మంజుల (40) పది రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంది.
మూడు రో జుల క్రితం వరంగల్‌లోని ఓ దవాఖానలో చేరింది. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈమె చిన్న కుమారుడు నర్మిట సందీప్ హైదరాబాద్‌లో కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈ నెల 19న ఓ విషయమై మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నా డు. శనివారం స్వగ్రామంలో మంజుల అంత్యక్రియలు జరగగా, ఆమె కుమారుడు సందీప్ రాలేకపోయాడు. మృతురాలికి భర్త సురేశ్‌గౌడ్, పెద్దకుమారుడు సాయికుమార్ ఉన్నారు.