కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ. అనూష( Anusha ) , బి. శిరీష ( Sirisha) రాష్ట్ర స్థాయి పోటీలకు ( State level competitions ) ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ తెలిపారు. శుక్రవారం పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మందమర్రిలో నిర్వహించిన అండర్-19 కబడ్డీ పోటీల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఏ అనూష ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఖోఖో పోటీలో అండర్ 19 విభాగంలో ఇంటర్ సెకండీయర్ విద్యార్ధిని బి. శిరీష ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్, వ్యాయామ ఉపాధ్యాయుడు పి. శ్రీనివాస్ గౌడ్, పాఠశాల సిబ్బంది అభినందించారు.