ఎదులాపురం, ఏప్రిల్ 27 : మోడల్ సూల్ ఆరో తరగతితోపాటు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థుల కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాత హౌజింగ్ బోర్డులోని సరస్వతీ శిశుమందిర్, బంగారుగూడలోని మోడల్ సూల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించారు.
ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. మోడల్ స్కూల్, సరస్వతీ శిశు మందిర్ పరీక్ష కేంద్రాలను డీఈవో శ్రీనివాస్‌రెడ్డి తనిఖీ చేశారు. ఉదయం 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకు 1059 మంది దరఖాస్తులు చేసుకోగా.. 879 హాజరు కాగా 180 మంది గైర్హాజరైనట్టు తెలిపారు. అదేవిధంగా 6 నుంచి 10వ తరగతి ఖాళీ సీట్ల కోసం మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 774 దరఖాస్తులు చేసుకోగా 629 హజరై 145 మంది గైర్హాజరైనట్టు డీఈవో పేరొన్నారు.