సీసీసీ నస్పూర్, జనవరి 3: భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంచిర్యాల జిల్లా జాగృతి నాయకులు మర్వాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తన నివాసంలో కవితను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
జాగృతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు ఐద ప్రశాంత్, కందుల ప్రశాంత్, లక్ష్మణ్, మున్నా, సాయి, తదితరులు పాల్గొన్నారు.