కౌటాల, ఏప్రిల్ 28 : ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలంటూ కౌటాల మండలంలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్క శంకర్ కార్యకర్తలతో కలిసి పల్లెల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు.
ఆదివారం బోదంపల్లి, యాపలగూడ, నాగెపల్లి, గురుడుపేట, గుడ్లబోరి, వైగాం, పీపీనగర్, కన్నెపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు దుర్గం వెంకటేశ్, చారి గోవింద్ రావు, మంగేశ్, కత్తెరసాల శంకర్, కామ్రె శంకర్ ఉన్నారు.