ఇంద్రవెల్లి : మండలంలోని దస్నాపూర్ గ్రామంలో ఈనెల 29న జరిగే హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలో గల రైతు వేదిక భవనంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్స్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం, ఆంధ్ ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖాడే విష్ణు, వ్యవసాయ అధికారి గణేష్ రాథోడ్, ఆంధ్ ఆదివాసీ సంఘం జిల్లా కార్యదర్శి మారుతి, పుండలిక్ పటేల్, కేశవ్, గజానంద్ తదితరులు పాల్గొన్నారు.