ఉట్నూర్ రూరల్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ( Utnoor ) మండలంలోని చింతగూడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పంద్రం గంగాధర్ ఇళ్లు అగ్నికి అహుతి అయింది. విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Vedma Bojju Patel ) చింతగూడ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా బాధితుడి ఇంటిని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనవంతుగా రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గోండ్ గూడ గ్రామానికి చెందిన తొడసం గంగు అనారోగ్యం కారణంగా మృతిచెందగా అంత్యక్రియలకు హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.