మంచిర్యాలటౌన్, అక్టోబర్ 13 : మంచిర్యాల పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్రోడ్లో ఆదివారం ఆయన పర్యటించారు. రోడ్డు స్థలాలను ఆక్రమించుకొని కట్టడాలు చేపట్టిన వారికి మున్సిపల్ అధికారులు ఇంతకుముం దే మార్కింగ్ ఇచ్చారని, ఆ ప్రకారంగా ఎవరికి వారు చర్యలు చేపట్టాలని తెలిపారు.
త్వరలోనే మార్కెట్ రోడ్‌ను వెడల్పు చేయడంతో పాటు, ఫుట్‌పాత్ నిర్మిస్తామన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఆ మేరకు అధికారులు అంచనాలను తయారు చేసి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, ఎంఈ మసూద్‌అలీ, ఏఈ రాజేందర్, టీపీవో సంపత్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉదయ్‌కిరణ్, విద్యుత్ శాఖ ఏడీఈ వేణుగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.