మంచిర్యాలటౌన్, జూన్ 14 : మంచిర్యాల పట్టణ వాసులకు ప్రతి రోజూ రెండు పూటలా తాగునీరందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ ఉప్పల య్య అధ్యక్షతన జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరుకాగా, చైర్మన్ ఉప్పలయ్య, కమిషనర్ మారుతీ ప్రసాద్ పూలబొకే అందించి, శాలువాతో సత్కరించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12 గంటలు దాటినా మొదలుకాకపోవడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరుపట్టికలో సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. అనంతరం 12.15 గంటలకు సమావేశం ప్రారంభమైంది.
ఎమ్మె ల్యే మాట్లాడుతూ వచ్చే యేడాది మార్చికల్లా పట్టణంలోని అన్ని ప్రాంతాలకు పైపులైన్లు వేస్తామన్నారు. అప్పటినుంచి అ న్ని వార్డుల్లో రెండు పూటలా తాగునీరందిస్తామని చెప్పారు. అనంతరం ఎజెండాలో పొందు పరిచిన 21 అంశాలను కౌన్సి ల్ ఆమోదించింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇబ్బందిగా మారిన విద్యుత్ స్తంభాలను మార్చేందుకు అవసరమైన రూ. 4.28 లక్షలను విద్యుత్ శాఖకు అందించడానికి కౌన్సిల్ ఆమోదించింది. 15వ ఫైనాన్స్ నిధులు రూ. 273.70 లక్షలతో తాగునీటి సరఫరాకు అవసరమున్న పైపులైన్లు, ఇతర అభివృద్ధి పనులు చేసేందుకు కౌన్సిల్ అంగీకారం తెలిపింది.
ము న్సిపల్ సాధారణ నిధులు రూ. 132.99 లక్షలు వెచ్చించి వివి ధ వార్డుల్లో చేపట్టాల్సిన అభివృధ్ది పనులకు కౌన్సిల్ ఆమోదం లభించింది. పట్టణంలో ఉన్న 292 సీసీ కెమెరాల నిర్వహణకు అవసరమైన రూ. 5.78 లక్షలు చెల్లించడానికి కౌన్సిల్ ఒప్పుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, రంజాన్ పండుగ సందర్భంగా చేపట్టిన పనులకు ఖర్చయిన మొత్తాన్ని చెల్లించేందుకు కౌన్సిల్ అంగీకరించింది. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ మారుతీ ప్రసాద్, మేనేజర్ విజయ్‌కుమార్, ఎంఈ మధూకర్, ఏఈ రాజేందర్, ఆర్వో శ్రీనివాస్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సునీల్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.