ఆసిఫాబాద్, డిసెంబర్ 28 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మండలంలోని సిర్సిగాంలోని భీమయ్యక్ దేవుని వార్షికోత్సవ మహోత్సవంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్‌తో కలసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయ పూజలు నిర్వహించారు. అనంతరం క్రీడలు ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్‌హైమద్, సర్పంచ్ తిరుపతి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.