ఎదులాపురం, అక్టోబర్ 16 : ‘కారు.. మన కేసీఆర్.. ఇదే మా ఎన్నికల నినాదం’ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్త, వార్డు మెంబర్ రాపెల్లి హనుమండ్లుతోపాటు కాలనీవాసులు 50 మం ది గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారికి ఎమ్మెల్యే జోగు రామన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. దేశంలో సంక్షేమ పథకాలకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌గా నిలిచిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే 49 వార్డులు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గు ర్తు చేశారు.
తెలంగాణ అన్ని రంగాలలో నంబర్‌వన్‌గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు అలా ల్ అజయ్, జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్, అధికార ప్రతినిధి బి. గంగారెడ్డి, బీసీ పట్టణాధ్యక్షుడు దాసరి రమేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూపారాణి, నాయకులు పాల్గొన్నారు.