తాంసి(తలమడుగు), నవంబర్ 26 : రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. ఆదివారం తలమడుగు మండలంలోని దేవాపూర్, భరంపూర్, రుయ్యాడి, సుంకిడి, తలమడుగు గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. సుంకిడి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాలుస్తూ జాదవ్ అనిల్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు.
తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో పేదలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. భరంపూర్ యాదవ ఆత్మీయ సమావేశంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిచిన సోయం బాపురావ్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ తాటిపల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి, బీసీ యాదవ సంఘం నాయకులు డాక్టర్ రవి కిరణ్ యాదవ్, కన్వీనర్ తోట వెంకటేశ్, అధికార ప్రతినిధి మొట్టె కిరణ్, అరుణ్, సర్పంచ్‌లు స్వప్న రత్న ప్రకాష్, మునేశ్వర్ భరత్, సదానందం, వెంకన్న, తూర్పుబాయి, యశ్వంత్, అలాలి జ్యోతి నర్సింగ్, సుదర్శన్ రెడ్డి, అండె అశోక్, బీఆర్ఎస్ నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, మేకల రవికాంత్, రమాకాంత్, అజయ్ జాదవ్, మగ్గిడి ప్రకాశ్, సంజీవ రెడ్డి, మహేందర్, అశోక్, సునీల్, దేవేందర్, స్వామి, చంద్రయ్య పాల్గొన్నారు.
ఇచ్చోడ, నవంబర్ 26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటేయాలని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. మండల కేంద్రంతో పాటు అడిగామ(కే) గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అడిగామ(కే)కు చెందిన 50 మంది గ్రామస్తులు జాదవ్ అనిల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, ఎంపీటీసీలు గాడ్గె సుభాష్, పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ రమేశ్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణకుమార్, శ్రీనివాస్, పాండు పాల్గొన్నారు.
తాంసి(భీంపూర్), నవంబర్ 26: అందరి సంక్షేమం కోసం మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. పిప్పల్‌కోటి మోడు నుంచి కరంజి(టీ) వరకు భారీ బైక్ ర్యాలీ తీశారు. అడుగడుగునా ఆయనకు జనం నీరాజనం పలికారు. భీంపూర్, కరంజి, అంతర్గాం, ధనోర గ్రామాల్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కరంజి(టీ)లో ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మితే మళ్లీ అంధకారం తప్పనిసరి అన్నారు.
అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్, రాజు, ఎంపీపీ కుడ్మెత రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, నాయకులు నరేందర్ యాదవ్, కల్చప్ యాదవ్, కపిల్, కాకటి నరేందర్ రెడ్డి, సర్పంచ్‌లు స్వాతిక, లలిత, లింబాజీ, కృష్ణ, గంగయ్య పాల్గొన్నారు.
నేరడిగొండ, నవంబర్ 26 : మండలంలోని కుమారి, కుప్టి, తర్నం, బుగ్గారం(బీ), సావర్గాం, బుగ్గారం(కే), కుంటాల గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్, నియోజకవర్గ ఇన్‌చారిజ మాజీ ఎంపీ నగేశ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గడ్డం భీంరెడ్డి, సర్పంచ్ రాజుయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, ఎంపీటీసీ సవిత, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, నాయకులు సయ్యద్ జహీర్, శంకర్, రాజేశ్వర్, సర్పంచ్ విశాల్‌కుమార్ పాల్గొన్నారు.