ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 3 : హస్నాపూర్ గ్రామానికి చెందిన రక్షిత నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందింది. కాగా.. బాధిత కుటుంబాన్ని మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు రక్షిత కుటుంబ సభ్యులను కలిసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు ఆపకుండా పోస్టుమార్టం కొరకు పంపడం దుర్మార్గమని అన్నారు. అదేవిధంగా సీసీ పుటేజీలు మాయం చేయడం అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. అనంతరం నిజామాబాద్ డీఎస్పీతో ఫోన్లో మాట్లాడుతూ న్యాయం జరిగేంత వరకు తాము ఊరుకునేదిలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఇంద్రవెల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం జాదవ్, తిరుమల్గౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, మాజీ వైస్ ఎంపీపీ సలీం మొద్దీన్, మాజీ సర్పంచ్ ఉపేందర్ జాదవ్, నాయకులు అజయ్ జాదవ్, కాటం రమేశ్, పాండురంగ్, భీంరావు, సురేందర్ యాదవ్, నిఖిల్, సదానంద్, తదితరులు పాల్గొన్నారు.