నిర్మల్ అర్బన్, మే 16: ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం కేసీఆర్ తమను క్రమబద్ధీకరించారని కాం ట్రాక్ట్ అధ్యాపకులు కొనియాడారు. పట్టణంలోని బుధవారం దివ్యగార్డెన్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు కృషి చేసిన రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని పూలమాల శాలువా తో ఘనంగా సన్మానించారు. హామీలను నెరవేర్చే ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు వినోద్, వెంకట్, సిర్గ రవి, నరహరి, శంకర్, శ్రీనివాస్, న ర్సయ్య తదితరులున్నారు.