ప్యాకేజీ-27తో బీడు భూములు సస్యశ్యామలం
రైతులకు సాగు నీరు అందించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించి పూర్తి చేస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
- రేపు మంత్రి కేటీఆర్ జిల్లాకు వస్తున్నారు
- అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
- హెలిప్యాడ్ పనుల పరిశీలన
- ఏర్పాట్లపై కలెక్టర్, పోలీస్, ఇరిగేషన్ అధికారులతో చర్చ
దిలావర్పూర్, అక్టోబర్ 2 : రైతులకు సాగు నీరు అందించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించి పూర్తి చేస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌తో నిర్మించిన ప్యాకేజీ-27(శ్రీలక్ష్మీ నరసింహాస్వామి లిఫ్ట్ ఇరిగేషన్)ను మంత్రి పరిశీలించారు. అక్కడి నుంచి దిలావర్పూర్ వద్ద డెలివరీ సిస్టర్న్‌ను సందర్శించారు. అనంతరం అధికారులు మంత్రి సమక్షంలో ప్యాకేజీ-27 ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సంబురాలు చేసుకున్నారు. ఏర్పాట్లపై కలెక్టర్, పోలీస్, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.
గుండంపల్లి పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలాన్ని, మోటార్లను పరిశీలించారు. అంతకు ముందు మంత్రి మాట్లాడుతూ.. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డెలివరీ సిస్టర్న్‌ను ప్రారంభించేందుకు రేపు (బుధవారం) వస్తున్నారని తెలిపారు. అనంతరం అక్కడే 500 మంది ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి 20 నిమిషాలపాటు మాట్లాడుతారని పేర్కొన్నారు. నిర్మల్ నియోజవర్గంలో 50 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించామన్నారు. ప్యాకేజీ-28 పనులను కూడా త్వరలోనే పూర్తిచేసి సాగు నీరు అందిస్తామని తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ రామారావు, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఇరిగేషన్ డీఈ గంగాధర్, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్‌ఖాన్, సహకార సంఘం చైర్మన్ రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, ఏలాల చిన్నారెడ్డి, రాంకిషన్‌రెడ్డి, అనిల్, గంగారెడ్డి, అడెపు శ్రీనివాస్, కోడే నవీన్, దనే రవి, సప్పల రవి, రాథోడ్ అశోక్, అరుణ్ ఉన్నారు.
అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, జిల్లా, మండల పరిషత్ అధికారులకు సూచనలు చేశారు. మంత్రి కేటీఆర్ వచ్చే రోడ్డు మార్గం గుండా మొక్కల చుట్టూ ట్రీ గార్డులు ఏర్పాటు చేసి, రంగులు వేయాలని సూచించారు. హెలిప్యాడ్ సమీపంలోని విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను తొలగించాలని ఆదేశించారు.

ఆయిల్ పామ్ పనుల పరిశీలన
సోన్, అక్టోబర్ 2 : నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పోచంపాడ్ గ్రామంలో రూ.200 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. రేపు (బుధవారం) శంకుస్థాపన చేయడానికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శిలాఫలకం, సభావేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సర్పంచ్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సుభాష్‌రావు, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

