జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురం అంబరాన్నంటు తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ మిఠాయిలు పంపిణీ చేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమకు న్యాయం చేసిన బీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటామంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1063 మంది విధులు నిర్వర్తిస్తుండగా, వారందరికీ ప్రయోజనం చేకూరనున్నది.
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ మురవాలె.. గ్రామకార్యదర్శుల ఇన్చార్జి వ్యవస్థ పోవాలె .. ఏ ఊరు కార్యదర్శి ఆ ఊరులోనే ఉండాలి’ అనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్ల క్రితం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించారు. సందర్భం వచ్చిన ప్రతిసారి జేపీఎస్‌ల పనితీరు బాగుందని, పల్లెప్రగతి విజయం వెనుక వారి సహకారం అమోఘమని చెబుతూ వచ్చారు. సమ్మె కాలంలోనూ జేపీఎస్‌ల విషయంలో సదుద్దేశంతో ఉన్నామని, సమ్మె విరమించి విధుల్లో చేరాలని సూచించారు. అలా సమ్మె విరమించారో లేదో రెగ్యులరైజేషన్ చేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో జేపీఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ మిఠాయిలు పంపిణీ చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంచిర్యాల జిల్లాలో 218 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 212, ఆదిలాబాద్ జిల్లాలో 318, నిర్మల్ జిల్లాలో 315 మంది విధులు నిర్వర్తిస్తుండగా, వారందరికీ ప్రయోజనం చేకూరనున్నది.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
ఆసిఫాబాద్, మే 24 : ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శు లను రెగ్యులరైజ్ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతి స్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకె ళ్లడంలో కీలకంగా వ్యవహరించాం. నాలుగేళ్లు గడిచినా రెగ్యులర్ చేయడం లేదనే భావనతో ప్రశాంత వాతావరణంలో సమ్మె చేశాం. ఎక్కడా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిం చలేదు. సీఎం కేసీఆర్ పంచాయతీ సెక్రెటరీలను రెగ్యులర్ చేసేందుకు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాము.
– బీ.మల్లేశ్, జూ.పం.కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు, కెరమెరి.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
హాజీపూర్, మే 24 : జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులను రెగ్యుల రైజ్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కృతజ్ఞతలు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విధి విధానాలు, జీపీల్లో పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకుం టాం అనడం సంతోషాన్ని కలిగించింది.
– శ్రీపతి బాపురావు, మండల పంచాయతీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
త్వరితగతిన పూర్తి చేయాలి
ఆసిఫాబాద్, మే 24 : గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చడంలో పంచాయతీ కార్యదర్శుల శ్రమ దాగి ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేశాం. పంచాయతీలకు అనేక అవార్డు లు రావడంలో మా కృషి ఎంతో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు మా నాలుగేండ్ల సేవలను సర్వీసుగా పరిగణించి.. క్రమబద్ధీకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తే మరింత ఉత్సాహంతో పని చేస్తాం.
– శేని తిరుపతి,పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు,కౌటాల
ప్రతిఫలం దక్కింది
రెబ్బెన, మే 24 : తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచా యతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. నాలుగేళ్ల సేవలకు ప్రతిఫలం దక్కింది. ఇందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మరింత అంకితభావంతో పనిచేస్తాం. కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా పల్లెల ప్రగతిలో పాలుపంచుకుంటాం.
– కిరణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి, నవేగాం
బాధ్యత పెరిగింది..
భైంసా, మే 24 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా సర్వీసును క్రమబద్ధీకరించడంతో బాధ్యత పెరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కష్టపడి పనిచేస్తాం. ప్రజలకు చేర వేయడానికి శాయశక్తులా కృషి చేస్తాం. గ్రామాల అభివృద్ధికి పాటు పడుతాం. మా సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కృష్ణవేణి, పెండ్పెల్లి.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
కోటపల్లి, మే 24 : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇది గొప్ప నిర్ణయం. మా సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పిస్తున్న కేసీఆర్‌కు కృతజ్ఞతలు. గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపి స్తాం. మా వంతు కృషి చేస్తాం. సర్కారు ఏ పని అప్పగించినా సంపూర్ణంగా సహకరిస్తాం.
– మహమ్మద్ అబ్దుల్ తాజుద్దీన్, జేపీఎస్‌ల సంఘం జిల్లా అధ్యక్షులు, మంచిర్యాల
అదృష్టంగా భావిస్తున్నా..
కోటపల్లి, మే 24 : తెలంగాణ ప్రభుత్వం జేపీఎస్‌లను క్రమబద్ధీకరించి తగిన గుర్తింపు ఇచ్చింది. నేను నాలుగేళ్లుగా మల్లంపేటలో జేపీఎస్‌గా పనిచేస్తున్నా. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవే యడంతో పాటు అభివృద్ధికి సహకరిం చా. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టు కుంది. మా కుటుంబాల్లో సంతోషం నిం పింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా.
– చెన్న శ్రీవిద్య, జేపీఎస్ మల్లంపేట
సంతోషిస్తున్నాం..
ఇచ్చోడ, మే 24 : మమ్ముల రెగ్యులర్ చేయాల ని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని సంతోషిస్తున్నాం. నాలుగేళ్లలో గ్రామాల రూపురేఖలు మార్చడంలో కార్యదర్శుల పాత్ర చాలా ఉంది. పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తాం. పల్లెలను అభివృద్ధి చేయడంతో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీలకు చాలా అవార్డులు వచ్చాయి.
– శ్రీధర్, జూనియర్ కార్యదర్శి మండలాధ్యక్షుడు, సిరికొండ.
చాలా ఆనందంగా ఉంది
నెన్నెల, మే 24 : ప్రభుత్వం గ్రామ పంచాయతీ లను బలోపేతం చేసేందుకు నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని ఉద్యోగులుగా నియమిం చింది. నాలుగేళ్ల పాటు మేము అందించిన సేవలను గుర్తించి ఇప్పుడు రెగ్యులర్ చేయాలని నిర్ణయించారు. మొదట ఉద్యోగావకాశం కల్పించి.. ఇప్పుడు భద్రత కల్పించారు. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. గ్రామాలాభివృద్ధిలో మా భాగస్వా మ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తాం.
– ఏ సరిత, ఘన్పూర్ కార్యదర్శి
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
లక్షెట్టిపేట రూరల్, మే 24 : గ్రామ పంచా యతీల రూపురేఖలు మార్చడంలో సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా పనిచేశాం. జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మా కష్టాన్ని గుర్తించి ఉద్యోగ భరోసా కల్పించిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– హరికృష్ణ, జేపీఎస్, అంకతిపెల్లి
నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
భైంసా, మే 24 : సీఎం కేసీఆర్‌కు మా కుటుంబాలు రుణపడి ఉంటాయి. మాపై నమ్మకంతో క్రమబద్ధీకరణకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదా రులకు అందేలా కృషి చేస్తాం. హరితహా రం, పల్లె ప్రగతి, పన్నుల వసూలు, పారిశుధ్యం లక్ష్యాల సాధనకు కృషి చేస్తాం. గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తాం.
– శ్రీనివాస్‌గౌడ్, సిరాల.
ప్రత్యేక కృతజ్ఞతలు..
దస్తురాబాద్, మే 24 : సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పంచాయ తీల అభివృద్ధికి ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తాం.కార్యదర్శులందరి తరఫున సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
– గోవర్ధన శ్రీనివాస్, గొడిసేర్యాల గొండు గూడెం(జీ).
చిత్తశుద్ధితో పనిచేశాం..
దండేపల్లి, మే 24 : జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం సార్ ప్రకటించారు. నాలు గేళ్లుగా జీపీల రూపురేఖలు మార్చేందుకు మా శ్రమను ప్రభుత్వం గుర్తించింది. కేసీఆర్ సార్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడంతో గ్రామాలు అభివృద్ధి చెందాయి. నర్సరీలు, వైకుంఠధా మాలు, డంప్‌యార్డులపై చిత్తశుద్ధితో పనిచేశాం. ఫలితంగా గ్రామాలు ఎంతో ప్రగతి సాధించాయి. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– సునీత, జేపీఎస్, కర్ణపేట
రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం
లక్షెట్టిపేట రూరల్, మే 24 : సీఎం కేసీఆర్ మమ్ముల రెగ్యులరైజ్ చేస్తారని మాకు నమ్మకముండే. అనుకున్నట్లుగానే క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదా లు. బంగారు తెలంగాణ కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మరిన్ని అవార్డులు తెచ్చేలా నిర్విరామంగా కృషి చేస్తాం.
– గడ్డం వరుణ్, మంచిర్యాల జిల్లా జేపీఎస్‌ల సంఘం జిల్లా నాయకుడు.